మ్యాంగో పాప్‌సికెల్‌

ABN , First Publish Date - 2017-05-20T20:40:27+05:30 IST

కావలసిన పదార్థాలు

మ్యాంగో పాప్‌సికెల్‌

కావలసిన పదర్థాలు
మామిడి పండు - ఒకటి (తొక్క తీసి. ముక్కలు తరిగి), మంచినీళ్లు/సోడా/పాలు - పావు కప్పు, పంచదార - రుచికి సరిపడా.
 
తయారీ విధానం
మామిడి పండు ముక్కల్ని, మిగతా పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి.
పాప్‌సికెల్‌ అచ్చుల్లో ఈ గుజ్జును ఉంచి మూతపెట్టాలి. ఒకవేళ పాప్‌సికెల్‌ అచ్చులు లేకపోతే చిన్న పేపర్‌ కప్పులు లేదా గ్లాసు కప్పులు అయినా వాడొచ్చు. గుజ్జును నింపిన అచ్చుల్లో ఐస్‌క్రీం స్టిక్స్‌ గుచ్చి ఫ్రిజ్‌లో ఉంచాలి. గట్టిపడేందుకు నాలుగు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది.
తినాలనుకున్నప్పుడు అచ్చుల్ని ట్యాప్‌ వాటర్‌ కింద లేదా గోరు వెచ్చని నీళ్లను ఒక గిన్నెలో పోసి పది సెకన్లు ఉంచి తీయాలి. ఆ తరువాత నెమ్మదిగా అచ్చుల నుంచి మ్యాంగో ఐస్‌ఫ్రూట్‌ను బయటికి తీసి తినేయాలి.
టిప్స్‌:
ఇందులో కుంకుమపువ్వు లేదా యాలకల పొడి కలుపుకోవచ్చు.
మామిడి గుజ్జు తయారుచేసేటప్పుడు కొన్ని నీళ్లు లేదా పాలు లేదా కొబ్బరి పాలు అయినా కలపొచ్చు.
నిమ్మ సోడా లేదా ఆరెంజ్‌ ఫ్లేవర్‌ ఉన్న సోడా వాడొచ్చు. అయితే వేరే రుచి వస్తుంది. అందుకని మీ మూడ్‌ని బట్టి నచ్చిన వెరైటీ చేసుకోండి.

Updated Date - 2017-05-20T20:40:27+05:30 IST