కోకో కేక్
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
మైదా - ఒక కప్పు, బటర్ - అరకప్పు + 2 టేబుల్ స్పూన్లు, పంచదార - అరకప్పు, పాలు - అరకప్పు, గుడ్డు - ఒకటి, వెనీలా ఎసెన్స్ - ఒక టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూన్లు, ఉప్పు - చిటికెడు, కోకో పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, చోకో చిప్స్ - అరకప్పు.
తయారుచేసే విధానం
ఓవెన్‌ను 180 సెం. డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసుకొని ఉంచాలి. కేక్ టిన్ లోపలవైపు బటర్/నూనెతో రుద్దుకోవాలి. మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో పంచదార, బటర్ బాగా కలపాలి. గుడ్ల సొన వేసి మరోసారి గిలకొట్టాలి. తర్వాత పాలు, వెనీలా వేసి మరో 30 సెకన్లు గిలకొట్టాలి. ఇందులో కొద్దికొద్దిగా మైదా, కోకో మిశ్రమం కలపాలి. ఈ బాటర్‌ను కేక్ టిన్‌లో పోసి పైన చోకో చిప్స్ చల్లి ఓవెన్‌లో 26 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.