మ్యాంగో మౌస్‌

ABN , First Publish Date - 2016-04-30T21:02:39+05:30 IST

వాల్సిన పదార్థాలు: పండిన మామిడికాయలు- 2, జెలటిన్‌- 15 గ్రాములు, కోడిగుడ్లు- 3 (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి), ఉప్పు- తగినంత, చక్కెర- పావుకప్పు, క్రీమ్‌- 6 టేబుల్‌స్పూన్లు

మ్యాంగో మౌస్‌

కావాల్సిన పదార్థాలు: పండిన మామిడికాయలు- 2, జెలటిన్‌- 15 గ్రాములు, కోడిగుడ్లు- 3 (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి), ఉప్పు- తగినంత, చక్కెర- పావుకప్పు, క్రీమ్‌- 6 టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం:
మామిడిపండ్లను శుభ్రంగా కడిగి తొక్కతీసేయాలి. మామిడి టెంకల్ని తీసేయాలి. ఆ తర్వాత రెండు మామిడిపండ్ల గుజ్జును తీసి బ్లెండ్‌ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లో తీసుకుని క్రీమ్‌ వేయాలి. కోడిగుడ్ల పచ్చసొనను ఉప్పుతో కలిపి డబుల్‌ బాయిల్‌ చేయాలి. దాంట్లోకి చక్కెర చల్లాలి. అలాగే ద్రవంపోయేంత వరకూ వేడిచేస్తూ పోతే క్రీమ్‌లాగా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని మామిడిపండ్ల గుజ్జును కలపి పక్కనబెట్టుకోవాలి. ఈ మిశ్రమంలోకి నీటితో కరిగించిన జెలటిన్‌ను వేయాలి. ఫ్రిజ్‌లో మూడుగంటల పాటు పెట్టుకుని సర్వ్‌ చేసుకోవచ్చు

Updated Date - 2016-04-30T21:02:39+05:30 IST