మామిడి కుల్ఫీ

ABN , First Publish Date - 2016-04-26T20:40:13+05:30 IST

కావలసిన పదార్థాలు: పెద్ద మామిడి పళ్ళు- 2, పాలు- 4 కప్పులు, క్రీం- 1/2 కప్పు, కండెన్సడ్‌ మిల్క్‌(స్వీట్‌)- అరలీటరు, పిస్తా, బాదం తురుము- 1 టేబుల్‌ స్పూను, కుంకుమపువ్వు- అరటీస్పూను, పంచదార- 1 కప్పు.

తయారీ విధానం: పాలు సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత క్రీం, కండెన్సడ్‌ మిల్క్‌లను కూడా పోసి సన్నని మంటమీద పదార్థం చిక్కగా క్రీంలా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి పిస్తా, బాదం తురుము, కుంకుమపువ్వు వేసి దించేయాలి. తరువాత మామిడిపండు చెక్కుతీసి, సగానికి కోసి టెంక తీసివేయాలి. ముక్కల మధ్య భాగంలో కొంత గుజ్జును తీసేసి ఆ ఖాళీలో పాలమిశ్రమాన్ని పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

Updated Date - 2016-04-26T20:40:13+05:30 IST