హనీ రోస్ట్ చికెన్
ABN , First Publish Date - 2017-12-02T16:51:35+05:30 IST
కోడి (స్కిన్ తీయకుండా) - ఒకటి, నిమ్మరసం-50 ఎంఎల్, వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను, కశ్మీరీ మిర్చి- ఒకటిన్నర స్పూను, నూనె-50 ఎంఎల్.
- చికెన్ మీద లోతుగా గాట్లు పెట్టాలి.
- నిమ్మరసం, వెల్లుల్లి, కారాలను బాగా కలపాలి.
- వేగించిన ఉల్లితరుగును గ్రైండ్ చేసి ఆ పేస్టును మిగతా పదార్థాలతో కలిపి నానబెట్టాలి.
- ఆ పేస్టులో 2/3 వంతు భాగాన్ని చికెన్ లోపల, పైభాగాలకు పట్టించి గంట పాటు ఉంచాలి.
- మిగిలిన పేస్టును స్టఫ్పింగ్ పదార్థాల్లో కలిపి చికెన్ లోపల కూరాలి.
- ఆ చికెన్‌ని రోస్టింగ్ టిన్‌లో పెట్టి 220 సెంటిగ్రేడ్‌లో రోస్ట్ చేయాలి.
- చికెన్ మెత్తగా అయ్యే వరకు ఒవెన్‌లో ఉడికించాలి.
- ఆ తర్వాత చికెన్‌పై తేనే పోసి మరో పది నిమిషాలు ఒవెన్‌లో ఉడికించాలి.
- అలా తయారైన హనీ రోస్ట్ చికెన్ పైన కాస్త నూనె రాసి తింటే బాగుంటుంది.