ఎగ్‌ పుడ్డింగ్‌

ABN , First Publish Date - 2018-05-06T00:09:32+05:30 IST

గుడ్లు - 4, పాలు - అర లీటరు, పంచదార - 6 టేబుల్‌ స్పూన్లు, వెనిలా ఎసెన్స్‌ - 10 చుక్కలు..

ఎగ్‌ పుడ్డింగ్‌

కావలసిన పదార్థాలు
 
గుడ్లు - 4, పాలు - అర లీటరు, పంచదార - 6 టేబుల్‌ స్పూన్లు, వెనిలా ఎసెన్స్‌ - 10 చుక్కలు.
 
తయారుచేసే విధానం
 
గుడ్ల సొన, పంచదార ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేలాగా గిలకొట్టాలి. తరువాత పాలు, వెనీలా ఎసెన్స్‌ కూడా కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టి ఆవిరిపై 15 నిముషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా ఉన్నప్పుడు సర్వ్‌ చెయ్యాలి. సర్వ్‌ చేసేటప్పుడు జీడి పప్పు, పిస్తా ముక్కలు వేస్తే చాలా బావుంటుంది.

Updated Date - 2018-05-06T00:09:32+05:30 IST