Abn logo

వాంగీబాత్‌

కావలసిన పదార్థాలు
 
సజ్జ రవ్వ - 150 గ్రా., వంకాయలు - 70 గ్రా., ఉల్లిపాయలు - 15 గ్రా., పచ్చిమిర్చి - 15 గ్రా., పసుపు - 2 గ్రా., యాలకులు - 5 గ్రా., చెక్క - 5 గ్రా., జీలకర్ర - 5 గ్రా., అల్లం తురుము - ఒక స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 10 గ్రా., అల్లం వెల్లులి ముద్ద - 10 గ్రా.
 
తయారీ విధానం
 
బాణలిలో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేగనిచ్చి తీసివేయాలి. అదే పాత్రలో నూనె వేసి యాలకులు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, తురిమిన అల్లం, వంకాయ తరుగు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. తరువాత 4 కప్పుల నీళ్ళు పోసి రుచికి తగినంత ఉప్పు, రవ్వ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో ప్రొటీన్లు 6.8 గ్రా., కొవ్వు 4.5 గ్రా., పీచు పదార్థం 1.3 గ్రా., పిండి పదార్థం 38.1 గ్రా., శక్తి 207.8 కి. కెలోరీలు, కాల్షియం 35.6 మి.గ్రా., ఇనుము 5.0 మి.గ్రా.

పాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌దద్దోజనంస్వీట్‌కార్న్‌ పలావ్‌ క్యారెట్ రైస్పనసకాయ బిర్యానిసాబూదానా కిచిడీబిసిబేళ బాత్‌కొర్రల వెజిటబుల్‌ బిర్యానినిమ్మ సద్ది
Advertisement
d_article_rhs_ad_1
Advertisement