Abn logo

చింతచిగురు బోటి

కావలసిన పదార్థాలు
 
బోటి - అరకేజీ, చింతచిగురు - కొద్దిగా, ఉల్లిపాయలు - రెండు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - మూడు టీస్పూన్లు, కారం - టీస్పూన్‌, పసుపు - కొద్దిగా, పచ్చిమిర్చి - నాలుగు, గరంమసాల - టీస్పూన్‌, కరివేపాకు - కట్ట, కొత్తిమీర - కట్ట, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
 
ముందుగా కుక్కర్‌లో బోటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతచిగురును పేస్టు మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బోటిని వేసి కలియబెట్టుకోవాలి. కాసేపయ్యాక అల్లం పేస్టు వేయాలి. కారం, గరంమసాలా, కరివేపాకు వేసి, కలపాలి. చివరగా చింతచిగురు పేస్టును వేయాలి. చిన్న మంటపై కాసేపు ఉంచి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. నోరూరించే చింతచిగురు బోటి రెడీ.

బొంగులో చికెన్ (వీడియో)సెనగపప్పు చికెన్‌ ఖీమా మటన్‌ ఘోష్‌మటన్‌ ఎగ్‌ ఖీమా రొయ్యల వేపుడు మటన్‌ కీమా కోఫ్తా కర్రీమటన్‌ దోసకాయమటర్‌ మష్రూమ్‌మహారాష్ట్ర చికెన్‌మామిడి కాయ కోడికూర
Advertisement
d_article_rhs_ad_1
Advertisement