పుదీనా షర్బత్‌

ABN , First Publish Date - 2018-04-22T20:09:16+05:30 IST

పుదీనా ఆకులు - ఒకటిన్నరకప్పులు, బెల్లం పొడి లేదా పంచదార - పది టేబుల్‌ స్పూన్లు, మంచి నీళ్లు...

పుదీనా షర్బత్‌

కావలసినవి
 
పుదీనా ఆకులు - ఒకటిన్నరకప్పులు, బెల్లం పొడి లేదా పంచదార - పది టేబుల్‌ స్పూన్లు, మంచి నీళ్లు - అరకప్పు, బ్లాక్‌ సాల్ట్‌ - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, నిమ్మ రసం - నాలుగు టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడగాలి. తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మెత్తటి గుజ్జు అయ్యే వరకు గ్రైండ్‌ చేయాలి. పుదీనా రసాన్ని వడకట్టాలి.
పావు మోతాదు వడకట్టిన పుదీనా రసాన్ని తీసుకోవాలి. అందులో ముప్పావు భాగం నీళ్లు పోసి బాగా కలపాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లగా పుదీనా షర్బత్‌ తాగుతుంటే ఎండ మాయం అవ్వడం ఖాయం. ఇందులో బెల్లం, పంచదారలకు బదులుగా తేనె అయినా వాడొచ్చు.

Updated Date - 2018-04-22T20:09:16+05:30 IST