సీతాఫలం బొప్పాయి ప్రొటీన్‌ షేక్‌

ABN , First Publish Date - 2018-11-17T18:59:52+05:30 IST

బొప్పాయి ముక్కలు - ఒకటిన్నర కప్పు, సీతాఫలం -ఒకటి (గుజ్జుతీసి), అల్లం - ఒక టీస్పూను...

సీతాఫలం బొప్పాయి ప్రొటీన్‌ షేక్‌

కావలసినవి
 
బొప్పాయి ముక్కలు - ఒకటిన్నర కప్పు, సీతాఫలం -ఒకటి (గుజ్జుతీసి), అల్లం - ఒక టీస్పూను (తరుగు), నిమ్మరసం - పావుకప్పు, క్యారెట్‌ముక్కలు - కొన్ని, పెరుగు - పావుకప్పు, కొబ్బరినీళ్లు - ముప్పావుకప్పు,
 
తయారీవిధానం
పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలిపి బ్లెండర్‌లో వేసి షేక్‌ చేయాలి. నిమ్మరసం కావాలంటే ఇంకాస్త కలుపుకోవచ్చు. తీయటి టేస్టు కోరుకునేవాళ్లు బొప్పాయి, సీతాఫలం ప్రొటీన్‌షేక్‌లో తేనె కూడా కలుపుకోవచ్చు.

Updated Date - 2018-11-17T18:59:52+05:30 IST