రోస్టెడ్‌ మిక్స్డ్ వెజిటబుల్‌ క్వినోవా సలాడ్‌

ABN , First Publish Date - 2018-04-14T21:57:05+05:30 IST

వండిన క్వినోవా - 1 కప్పు, (ఇష్టమైతే రంగుల) కాప్సికం ముక్కలు - 1 కప్పు, పాలకూర లేదా క్యాబేజీ తరుగు

రోస్టెడ్‌ మిక్స్డ్ వెజిటబుల్‌ క్వినోవా సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
వండిన క్వినోవా - 1 కప్పు, (ఇష్టమైతే రంగుల) కాప్సికం ముక్కలు - 1 కప్పు, పాలకూర లేదా క్యాబేజీ తరుగు - 1/2 కప్పు, సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు, స్వీట్‌ కార్న్‌ (ఉడికించినవి) - 1/2 కప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు - 1/2 స్పూను
చొప్పున, ఆలివ్‌ ఆయిల్‌ - 2 స్పూనులు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, బాదం తరుగు - 1 స్పూను; నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి - తగినంత.
 
తయారుచేసే విధానం
 
నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేగించండి. ఇప్పుడు కొత్తిమీర తప్ప మిగిలిన కూరగాయల తరుగు వేసి రెండు నిమిషాలు మాత్రమే వేగించండి. ఎక్కువసేపు వేగిస్తే ముక్కలు మెత్తబడి సలాడ్‌ బాగుండదు. తర్వాత క్వినోవా రైస్‌ కలిపి నిమిషం పాటు వేగించి దించేయండి. పది నిమిషాల తర్వాత ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి పైన కొత్తిమీర చల్లుకుంటే సరి. దీన్ని అల్పాహారంగా లేదా డిన్నర్‌గా .. ఎప్పుడు తిన్నా మంచిదే.

Updated Date - 2018-04-14T21:57:05+05:30 IST