కీర సలాడ్‌

ABN , First Publish Date - 2018-04-14T23:19:46+05:30 IST

కీర దోసకాయ - ఒకటి (తొక్క తీసి పెద్దముక్కలుగా తరిగి), కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు...

కీర సలాడ్‌

కావలసినవి
 
కీర దోసకాయ - ఒకటి (తొక్క తీసి పెద్దముక్కలుగా తరిగి), కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరిగి), తాజా కొబ్బరి తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, వేగించిన పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు (కచ్చాపచ్చాగా చేసి), చక్కెర - అర టీస్పూను, నిమ్మరసం- రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా.
తాలింపు కోసం: - నెయ్యి - ఒక టీస్పూను, ఆవాలు - అర టీస్పూను, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొంచెం.
 
తయారీవిధానం
 
కీరదోస, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి తరుగులను గిన్నెలో వేసి బాగా కలపాలి. కచ్చాపచ్చాగా చేసిన పల్లీ పొడిని కూడా గిన్నెలో వేసి కలపాలి. తర్వాత ఉప్పు, చక్కెర, నిమ్మరసం వేసి కలపాలి. పాన్‌ను సన్నని మంటపై పెట్టి నెయ్యి వేడిచేయాలి. తరువాత ఆవాలు, ఎండు మిర్చిలను వేగించాలి. తరువాత కరివేపాకు వేయాలి.
తాలింపును కీర దోస సలాడ్‌పై వేసి కలిపితే సలాడ్‌ రెడీ.

Updated Date - 2018-04-14T23:19:46+05:30 IST