పచ్చి మామిడి పన్హా

ABN , First Publish Date - 2018-04-13T20:46:33+05:30 IST

పచ్చి మామిడి కాయలు - రెండు(ఉడికించి, పైతొక్కతీసి), పంచదార పొడి - ముప్పావు కప్పు, యాలకల

పచ్చి మామిడి పన్హా

కావలసినవి
 
పచ్చి మామిడి కాయలు - రెండు(ఉడికించి, పైతొక్కతీసి), పంచదార పొడి - ముప్పావు కప్పు, యాలకల పొడి - అర టీస్పూన్‌, కుంకుమపువ్వు - కొంచెం.
 
తయారీవిధానం
 
ఉడికించిన మామిడి కాయల్ని ఒక గిన్నెలో వేసి చేతితో నలిపి గుజ్జు తీయాలి. తరువాత తీసిన గుజ్జును వడకట్టాలి. వడకట్టాక అందులో పంచదార, యాలకల పొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలోకి తీసి, ఫ్రిజ్‌లో నిల్వచేయాలి.
పన్హా తాగాలనిపించినప్పుడు గ్లాసులో మిశ్రమాన్ని వేయాలి. చల్లటి నీళ్లు పోసి కలపాలి.
చల్ల చల్లగా తాగితే ఈ గుజరాతీ పానీయం రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-04-13T20:46:33+05:30 IST