బ్రొకోలి ఆమ్లెట్‌

ABN , First Publish Date - 2017-06-17T19:09:05+05:30 IST

కావలసిన పదార్థాలు సన్నగా తరిగిన బ్రొకోలి - 100 గ్రా., గుడ్లు - 4, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి

బ్రొకోలి ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు
 
సన్నగా తరిగిన బ్రొకోలి - 100 గ్రా., గుడ్లు - 4, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అర కప్పు, మిరియాలపొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను, పాలు - పావు కప్పు. నూనె లేదా వెన్న - కాల్చడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
ఒక బౌల్‌లో పదార్థాలన్నీ వేశాక, గుడ్ల సొన కూడా వేసి బాగా గిలకొట్టాలి. పెనంపై నూనె/వెన్న వేసి గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్లుగా పోసుకుని రెండు వైపులా దోరగా వేగించుకోవాలి. టిఫిన్‌గా లేదా రసం అన్నంతో సైడ్‌ డిష్‌గా తింటే బాగుంటాయి.

Updated Date - 2017-06-17T19:09:05+05:30 IST