చట్‌పటా నీంబూ పానీ

ABN , First Publish Date - 2018-03-30T18:59:36+05:30 IST

నిమ్మకాయలు - నాలుగు, పంచదార - రుచికి తగినంత, జల్‌జీర పొడి...

చట్‌పటా నీంబూ పానీ

కావలసినవి
 
నిమ్మకాయలు - నాలుగు, పంచదార - రుచికి తగినంత, జల్‌జీర పొడి (సూపర్‌ మార్కెట్‌లో లభిస్తుంది) - రెండు టేబుల్‌ స్పూన్లు, చల్లటి మంచి నీళ్లు - సరిపడా, నిమ్మ చెక్కలు - అలంకరణకు
 
తయారీవిధానం
 
అన్ని నిమ్మకాయల రసాన్ని పిండేయాలి. తరువాత నిమ్మ రసాన్ని వడకట్టి గింజలు తీసి ఒక పెద్ద జగ్గులో పోయాలి. అందులో పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిస్తేనే రుచి బాగుంటుంది. రెడీ అయిపోయిన చట్‌పటా నీంబు పానీని ఫ్రిజ్‌లో పెట్టి తీసిన చల్లటి గ్లాసుల్లో పోసి నిమ్మ చెక్కలతో అలంకరించాలి. ఎక్కువ చల్లగా తాగాలనుకునే వాళ్లు క్రష్డ్‌ ఐస్‌ వేసుకోవచ్చు. పంచదార ఇష్టపడని వాళ్లు తేనె కలుపుకోవచ్చు.

Updated Date - 2018-03-30T18:59:36+05:30 IST