బెండ పెరుగు

ABN , First Publish Date - 2015-08-26T21:48:10+05:30 IST

కావలసిన పదార్థాలు: బెండకాయలు - అరకేజి, ఉల్లిపాయలు - 200 గ్రా., టమేటోలు - 50 గ్రా., నూనె - 100 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా

బెండ పెరుగు

కావలసిన పదార్థాలు: బెండకాయలు - అరకేజి, ఉల్లిపాయలు - 200 గ్రా., టమేటోలు - 50 గ్రా., నూనె - 100 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., పెరుగు - 400 గ్రా., నెయ్యి - 200గ్రా., గరంమసాలా - 5 గ్రా., కారం - 5 గ్రా., పసుపు - 5 గ్రా., జీరాపొడి - 5 గ్రా., ధనియాలపొడి - 5 గ్రా., కేసరి మెంతి - 5 గ్రా., ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బెండకాయల్ని శుభ్రంచేసి, తుడిచి రెండు ముక్కలుగా చేసి పక్కనుంచుకోవాలి. టమేటోలను, ఉల్లిపాయల్ని వేరువేరుగా నూనెలో వేగించి, పేస్టులా నూరి పెట్టుకోవాలి. పెరుగును చిక్కగా చిలకాలి. ముందుగా బెండకాయల్ని నూనెలో వేగించి తీసేయాలి. అదే కడాయిలో నెయ్యివేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి పేస్టు, టమేటో పేస్టు ఒకదాని తర్వాత ఒకటి రెండేసి నిముషాల తేడాతో వేస్తూ వేగించాలి. తర్వాత పెరుగు వేసి సన్నటి సెగపైన 15 నిమిషాలు ఉడికించాలి. బెండకాయల్ని, తక్కిన పొడులన్నిటిని చేర్చి మరో 5 నిమిషాలు ఉంచి, దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-26T21:48:10+05:30 IST