అలసంద సాంబారు

ABN , First Publish Date - 2015-08-26T21:46:42+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన అలసందలు - ఒక కప్పు, టమాటాలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, పచ్చి కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు

అలసంద సాంబారు

కావలసిన పదార్థాలు: ఉడికించిన అలసందలు - ఒక కప్పు, టమాటాలు - రెండు, పచ్చి మిర్చి - నాలుగు, పచ్చి కొబ్బరి తురుము - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం ముక్కలు - ఒక టీస్పూను, ఎండుమిరపకాయలు - నాలుగు, తాలింపు దినుసులు - ఒక టీస్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ఉప్పు - తగినంత, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కొత్తిమీర - కొద్దిగా, సాంబారు పౌడరు - అర టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారుచేసే విధానం: ముందుగా కడాయిలో నూనె పోసి కాగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వేగాక గ్రైండ్‌ చేసుకున్న అలసందల ముద్దను వేసి కలిపి, అందులోనే పలచగా చింతపండు రసం, టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, సాంబారు పౌడరు, పచ్చి కొబ్బరి తురుము వేసి అది మరుగుతుండగానే మరో కడాయిలో నూనె పోసి కాగాక ఇంగువ, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసి వేగాక మరుగుతున్న సాంబారులో కలిపి కాసేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2015-08-26T21:46:42+05:30 IST