మిక్స్‌ ఫ్రూట్‌ స్మూతీ

ABN , First Publish Date - 2018-02-10T21:57:39+05:30 IST

అరటిపండు- ఒకటి, ఆపిల్‌- ఒకటి, మామిడిపండు- ఒకటి, దానిమ్మ- ఒకటి, పెరుగు- అరకప్పు..

మిక్స్‌ ఫ్రూట్‌ స్మూతీ

కావలసినవి

అరటిపండు- ఒకటి, ఆపిల్‌- ఒకటి, మామిడిపండు- ఒకటి, దానిమ్మ- ఒకటి, పెరుగు- అరకప్పు, తేనె లేదా చక్కెర- ఒక టీస్పూను.
 
తయారీవిధానం
 
బ్లెండర్‌ తీసుకుని అందులో పైన పేర్కొన్న పండ్ల ముక్కలను (మీకు నచ్చిన మరేవైనా పళ్లను కూడా ఇందులో కలుపుకోవచ్చు), తేనె లేదా చక్కెర, ఐస్‌క్యూబ్స్‌ వేసి బ్లెండ్‌ చేయాలి. దీనికి పెరుగును జోడించి మళ్లీ రెండు నిమిషాలసేపు బ్లెండర్‌లో వేసి కొట్టాలి.
తర్వాత జల్లెడతో ఒడగట్టి గ్లాసులో పోసి కొన్ని ఐస్‌ క్యూబులు వేసుకుని తాగితే చిల్‌ మంటూ స్మూదీ గొంతులోంచి దిగుతూ హాయిగా ఉంటుంది.

Updated Date - 2018-02-10T21:57:39+05:30 IST