జల్‌ జీర

ABN , First Publish Date - 2018-03-13T19:04:08+05:30 IST

చింతపండు (గింజలు లేనిది) - ఒక టేబుల్‌ స్పూన్‌, పుదీనా - ముప్పావు కప్పు, జీలకర్ర - ఒకటిన్నర..

జల్‌ జీర

కావలసినవి

చింతపండు (గింజలు లేనిది) - ఒక టేబుల్‌ స్పూన్‌, పుదీనా - ముప్పావు కప్పు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, నల్లమిరియాల పొడి - అర టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పొడి - ఒక టీస్పూన్‌, పెద్ద యాలక్కాయ - ఒకటి (ఇష్టపడితే), ఇంగువ - చిటికెడు (రుచి నచ్చితే), బూందీ - ఒక టేబుల్‌ స్పూన్‌, చాట్‌ మసాలా పొడి - ఒక టీస్పూన్‌ (ఇష్టపడితే), బ్లాక్‌ లేదా రాక్‌ సాల్ట్‌ - సరిపడా.
 
తయారీవిధానం
 
పుదీనా ఆకులను, చింతపండును శుభ్రంగా కడగాలి.
బూందీని అర లేదా ముప్పావు కప్పు నీళ్లలో వేయాలి. అవి మెత్తపడిన తరువాత వడకట్టాలి. బూందీని, చాట్‌ మసాలాను కాకుండా మిగతా పదార్థాలని బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టాలి.
వడకట్టిన మిశ్రమంలో నాలుగు కప్పులు లేదా సరిపడినన్ని నీళ్లు పోయాలి.
దీన్ని ఫ్రిజ్‌లో ఉంచడం లేదా చల్లటి జల్‌జీరాను గ్లాసులో పోసుకుని తాగేయడమే తరువాయి.
తాగేముందు నానబెట్టిన బూందీ, చాట్‌ మసాలాలను జల్‌జీరా మీద వేసుకుని తాగితే రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-03-13T19:04:08+05:30 IST