స్ట్రాబెర్రీ-లెమనేడ్‌

ABN , First Publish Date - 2018-06-05T20:02:42+05:30 IST

నీళ్లు-మూడు కప్పులు, చక్కెర- ఒకటిన్నర కప్పు, నిమ్మరసం-రెండు కప్పులు(8-10 నిమ్మకాయలు...

స్ట్రాబెర్రీ-లెమనేడ్‌

కావలసినవి
 
నీళ్లు-మూడు కప్పులు, చక్కెర- ఒకటిన్నర కప్పు, నిమ్మరసం-రెండు కప్పులు(8-10 నిమ్మకాయలు అవసరం పడతాయి), స్ట్రాబెర్రీస్‌-ఒక పాకెట్‌, మినరల్‌ వాటర్‌- ఒక లీటరు, నిమ్మకాయముక్కలు, పుదీనా(అలంకరణకు).
 
తయారీ
సాస్‌ప్యాన్‌లో చక్కెర, నీళ్లు పోసి తక్కువ మంటపై మరగనివ్వాలి.
చక్కెర బాగా కలిసిపోయేంత వరకూ ఈ ద్రావణాన్ని మధ్య మధ్యలో కలపుతుండాలి.
స్టవ్‌ మీద నుంచి దించిన తర్వాత నిమ్మరసంలో కలిపి చల్లారనివ్వాలి.
బ్లెండర్‌లో స్ట్రాబెర్రీలు వేసి అందులో అరకప్పు లెమనేడ్‌ మిశ్రమం కలిపి బ్లెండర్‌లో వే సి ప్యూరీలా చేయాలి.
ప్యూరీని జల్లెడ పట్టి మిగిలివున్న లెమనేడ్‌ను అందులో కలపాలి.
రెండూ బాగా కలిసిపోయేలా గిలక్కొట్టి, ఆ మిశ్రమంలో మినరల్‌ వాటర్‌ కలిపి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయిన తర్వాత కొన్ని ఐస్‌ముక్కలు వేసి పుదీనా, నిమ్మకాయముక్కలతో (కావాలనుకుంటే) అలంకరించాలి. అలా రెడీ చేసిన సమ్మర్‌ డ్రింకును తాగితే సేద దీరుతారు.

Updated Date - 2018-06-05T20:02:42+05:30 IST