రాగి రొట్టె

ABN , First Publish Date - 2015-09-02T21:56:47+05:30 IST

కావలసిన పదార్థాలు : రాగిపిండి - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను

రాగి రొట్టె

కావలసిన పదార్థాలు : రాగిపిండి - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కరివేపాకు తరుగు - 1 టేబుల్‌ స్పూను, పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్‌
స్పూన్లు, క్యాప్సికం తరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T21:56:47+05:30 IST