ఉండ్రాళ్లు

కావలసినవి
 
బియ్యప్పిండి - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
సెనగపప్పుని అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. తరువాత నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. నానబెట్టిన సెనగపప్పుని వేసివేగించాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి మరిగించాలి. తరువాత బియ్యప్పిండిలో ఆ నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో గానీ, స్టీమర్‌ ప్లేట్‌లో గానీ పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. అంతే.. వినాయకుడి నైవేద్యానికి ఉండ్రాళ్లు రెడీ. 

హరా భరా కబాబ్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీఆరెంజ్‌ జామ్‌బెండకాయ కూటు వెజ్‌ హలీమ్‌చిలగడదుంప రబ్డీఉసిరి మురబ్బా
Advertisement
Advertisement