ఆలూ బీన్స్‌

ABN , First Publish Date - 2020-01-25T16:51:22+05:30 IST

కావలసినవి: బంగాళదుంపలు - మూడు, ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి -

ఆలూ బీన్స్‌

కావలసినవి: బంగాళదుంపలు - మూడు, ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
 
తయారీ: బీన్స్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బంగాళదుంప పొట్టు తీసి కట్‌ చేసి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి.
తరువాత ఇంగువ వేసి, బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి.
కాసేపు వేగిన తరువాత బీన్స్‌ వేసుకోవాలి. మరికాసేపు వేగించాలి.
ఇప్పుడు పసుపు, కారం, ధనియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికించాలి.
చివరగా గరంమసాల చల్లుకుని మరో రెండు నిమిషాలు ఉడికించి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-01-25T16:51:22+05:30 IST