జొన్న అంబలి

ABN , First Publish Date - 2018-03-10T19:59:33+05:30 IST

జొన్న పిండి - 1 కప్పు, పెరుగు - అర కప్పు, నీళ్లు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత...

జొన్న అంబలి

కావలసిన పదార్థాలు
 
జొన్న పిండి - 1 కప్పు, పెరుగు - అర కప్పు, నీళ్లు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత
 
తయారీవిధానం
 
జొన్న పిండిలో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయానికి పిండి అడుగుకి, నీళ్లు పైకి వేరవుతాయి. ఈ నీళ్లను వేరు చేసి గిన్నెలో పోసి, పొయ్యి మీద సన్నని మంటతో మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత వడకట్టిన పిండిని పోసి కలపాలి. ఉప్పు వేసి ఆపకుండా కలుపుతూ 10 నిమిషాలపాటు ఉడికించాలి. అంబలి మరీ చిక్కగా ఉంటే అర కప్పు నీళ్లు కలుపుకోవచ్చు. తగినంత చిక్కదనం వచ్చాక పొయ్యి మీద నుంచి దింపి గ్లాసులో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-03-10T19:59:33+05:30 IST