పచ్చి బఠాణీ కజ్జికాయలు

ABN , First Publish Date - 2019-07-13T20:43:08+05:30 IST

మైదా పిండి - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - ఒకటీస్పూన్‌

పచ్చి బఠాణీ కజ్జికాయలు

కావలసినవి
 
మైదా పిండి - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - ఒకటీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చి బఠాణీ - ఒకటిన్నర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
 
తయారీవిధానం
ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని, ఉప్పు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిబఠాణీ, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చి బఠాణీ దోరగా అయ్యే వరకు వేగించాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను వెడల్పుగా ఒత్తి, మధ్యలో బఠాణీ మిశ్రమం పెట్టి చివరలు దగ్గరకు చేర్చి ఒత్తుకోవాలి. గోధుమరంగు వచ్చే వరకు వీటిని వేగించుకుంటే నోరూరించే పచ్చి బఠాణీ కజ్జికాయలు రెడీ.

Updated Date - 2019-07-13T20:43:08+05:30 IST