దహీ పాపిడీ

ABN , First Publish Date - 2020-01-18T17:50:21+05:30 IST

పాపిడీలు - 30, బంగాళదుంపలు - మూడు, సెనగలు - పావు కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, పెరుగు - ఒక కప్పు, పంచదార - ఒక టీస్పూన్‌, కారం - కొద్దిగా, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, కారప్పూస - కొద్దిగా, కొత్తిమీర -ఒక కట్ట, ఉప్పు - తగినంత.

దహీ పాపిడీ

కావలసినవి: పాపిడీలు - 30, బంగాళదుంపలు - మూడు, సెనగలు - పావు కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, పెరుగు - ఒక కప్పు, పంచదార - ఒక టీస్పూన్‌, కారం - కొద్దిగా, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, కారప్పూస - కొద్దిగా, కొత్తిమీర -ఒక కట్ట, ఉప్పు - తగినంత.
 
తయారీ: ముందుగా బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి, చిదిమి పెట్టుకోవాలి.
సెనగలను ఉడికించి పక్కన పెట్టాలి.పెరుగులో పంచదార వేసి కలపాలి.
ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర సన్నగా కట్‌ చేసి పెట్టుకోవాలి.
ప్లేట్‌లో పాపిడీలను తీసుకొని ఒక్కో పాపిడీపై బంగాళదుంప ముక్కలు, సెనగలు వేయాలి. తరువాత పెరుగు వేసి, చాట్‌ మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేయాలి. ఇప్పుడు మళ్లీ కొద్దిగా చాట్‌ మసాలా, కారం, ఉప్పు చల్లాలి. కారప్పూస, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-01-18T17:50:21+05:30 IST