రాగి దోశ

ABN , First Publish Date - 2019-06-22T18:07:22+05:30 IST

రాగిపిండి - ఒకకప్పు, బియ్యం పిండి - అరకప్పు, రవ్వ - అరకప్పు, పెరుగు - అరకప్పు, నీళ్లు

రాగి దోశ

కావలసినవి
 
రాగిపిండి - ఒకకప్పు, బియ్యం పిండి - అరకప్పు, రవ్వ - అరకప్పు, పెరుగు - అరకప్పు, నీళ్లు - తగినన్ని, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, అల్లం - చిన్నముక్క
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో రాగిపిండి, బియ్యం పిండి, రవ్వ, పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోవాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ను స్టవ్‌పై పెట్టి దోశ పోసుకోవాలి. సాధారణ దోశ మాదిరిగా పాన్‌ మొత్తం అయ్యేలా అనకూడదు. కొద్దిగా నూనె వేసి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తరువాత తిప్పి మరోవైపు కాల్చుకోవాలి. పుదీనా చట్ని లేక కొబ్బరి చట్నీతో రాగి దోశలు తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-06-22T18:07:22+05:30 IST