రాగి ఇడ్లీ

ABN , First Publish Date - 2019-06-22T18:05:57+05:30 IST

ముందుగా పావు కప్పు నీళ్లను వేడి చేసుకోవాలి. ఒకపాత్రలో పిండి తీసుకొని, వేడి నీళ్లు పోసి కలుపుకోవాలి.

రాగి ఇడ్లీ

కావలసినవి
 
ఇడ్లీ పిండి - రెండు కప్పులు, రాగి పిండి - అరకప్పు, ఉప్పు - తగినంత, నూనె - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం
 
ముందుగా పావు కప్పు నీళ్లను వేడి చేసుకోవాలి. ఒకపాత్రలో పిండి తీసుకొని, వేడి నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత పులియబెట్టిన ఇడ్లీ పిండి, ఉప్పు వేసి కలియబెట్టాలి. పిండి చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంటపాటు పక్కన పెట్టాలి.
ఇడ్లీ పాత్రలకు నూనె రాసుకుంటూ పిండి వేయాలి. పాత్రలను ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. రాగి ఇడ్లీలు సాంబార్‌ లేక చట్నీతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-06-22T18:05:57+05:30 IST