బొంబాయి చికెన్

ABN , First Publish Date - 2018-08-12T15:54:29+05:30 IST

చికెన లెగ్‌ పీసెస్‌ : ఆరు, గుడ్డు : ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు : రెండు స్పూన్లు..

బొంబాయి చికెన్

కావలసిన పదార్థాలు
 
చికెన లెగ్‌ పీసెస్‌ : ఆరు, గుడ్డు : ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు : రెండు స్పూన్లు, నిమ్మరసం : 2 స్పూన్లు, తెల్లమిరియాల పొడి : పావు టీ స్పూన్, పచ్చిమిర్చి : ఆరు, సోయాసాస్‌ : 3 టేబుల్‌ స్పూన్లు, టమోటా సాస్‌ : 2 స్పూన్లు, రిఫైండ్‌ ఆయిల్‌ ఫ్రై చేయడానికి సరిపడినంత, కార్న్‌ ఫ్లోర్‌ : 2 స్పూన్లు, ఉప్పు : తగినంత
 
తయారీ విధానం
 
ముందుగా చికెన లెగ్‌ పీసులు శుభ్రంగా కడిగి వాటిని చాకుతో సన్నగా గాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని వైపులా గాటు పెట్టి ఉప్పు, నిమ్మరసం పట్టించి కొద్దిసేపు నానపెట్టాలి. ఈలోగా పచ్చిమిర్చి ముద్దగా నూరుకుని, సోయాసాస్‌, టమోటాసాస్‌, మైదా, కార్న్‌ఫ్లోర్‌, అల్లంవెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, తెల్లమిరియాల పొడి, గుడ్డును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చికెన ముక్కలను బాగా పట్టించి మరో 15 నిమిషాలు పాటు నానపెట్టాలి. ఇప్పుడు స్టవ్‌ మీద ఓ బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడయ్యాక ఒక్కో లెగ్‌పీస్‌ను వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి చల్లారక ముందే గ్రీన చిల్లీసాస్‌తో వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-08-12T15:54:29+05:30 IST