Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బిసిబేళ బాత్‌

బిసిబేళ బాత్‌

v id="pastingspan1">కావలసినవి
 
బియ్యం - ఒకకప్పు, కందిపప్పు - అరకప్పు, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - పది, మునగకాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి, బఠానీలు - పావు కప్పు, మామిడికాయ - ఒకటి, ఉల్లిపాయలు - రెండు, టొమాటో- ఒకటి, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, చింతపండు - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఎండు మిర్చి - నాలుగు, మిరియాలు - కొద్దిగా, మెంతులు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నువ్వులు - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, ఆవాలు - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. కుక్కర్‌లో వాటిని ఉడికించాలి. ఒక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంప, క్యారెట్‌, బీన్స్‌, బఠానీ, మామిడి తురుము, టొమాటో వేయాలి. ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేయాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అన్నం మిశ్రమాన్ని వేసి కలపాలి. చిన్నమంటపై కాసేపు ఉంచుకుని, నెయ్యి వేసి కలియబెడితే కమ్మని వాసన వస్తుంది. చివరగా కొత్తిమీర వేసుకొంటే బిసిబేళబాత్‌ రెడీ.

పనస బిర్యానీపనస బిర్యానీమామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌కొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ Mexican ఫ్రైడ్‌ రైస్‌ నరంజ్‌ పులావునరంజ్‌ పులావుమటర్‌ పులావ్‌మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) పన్నీర్ పులావ్ (వీడియో)
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.