జీడిపప్పు టమాటా సూప్‌

ABN , First Publish Date - 2015-08-30T23:24:16+05:30 IST

కావలసినవి: ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌: ఒక పాకెట్‌, జీడిపప్పు ముద్ద: నాలుగు టేబుల్‌ స్పూన్లు, టొమాటొ గుజ్జు

జీడిపప్పు టమాటా సూప్‌

కావలసినవి: ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌: ఒక పాకెట్‌, జీడిపప్పు ముద్ద: నాలుగు టేబుల్‌ స్పూన్లు, టొమాటొ గుజ్జు : ఒక కప్పు జీలకర్ర పొడి: అర టీ స్పూను, చీజ్‌: నాలుగు టేబుల్‌ స్పూన్లు.
ఎలా చేయాలి
ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీరుపోసి నూడిల్స్‌, జీడిపప్పు ముద్ద, టొమాటొ గుజ్జు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మూడు నిమిషాల పాటు ఉడికించండి. పొయ్యి మీద నుంచి కిందకు దించి ఉడికిన నూడిల్స్‌ మీద తురిమిన చీజ్‌ వేసి వేడిగా వడ్డించండి. ఇది చాలా తక్కువ సమయం, శ్రమ పట్టే వంటకం. టొమాటొ గుజ్జును సూపర్‌ మార్కెట్లో అమ్ముతారు. ఇంట్లోనే చేసుకోవాలంటే రెండు టొమాటొలను వేడినీటిలో కొద్ది సేపు ఉంచి బయటికి తీసాక వాటి తోలు తీసి మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవచ్చు. 

Updated Date - 2015-08-30T23:24:16+05:30 IST