రాగి వడ

ABN , First Publish Date - 2019-11-04T16:00:27+05:30 IST

రాగి పిండి - 80 గ్రా., శనగ పప్పు - 35 గ్రా., కారం పొడి - 5 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయలు - 10 గ్రా., పచ్చిమిర్చి - 5 గ్రా., అల్లం - 10 గ్రా., గరంమసాల పొడి - చిటికెడు,

రాగి వడ

కావలసిన పదార్థాలు : రాగి పిండి - 80 గ్రా., శనగ పప్పు - 35 గ్రా., కారం పొడి - 5 గ్రా., ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయలు - 10 గ్రా., పచ్చిమిర్చి - 5 గ్రా., అల్లం - 10 గ్రా., గరంమసాల పొడి - చిటికెడు, కరివేపాకు - 5 గ్రా., కొత్తిమీర - 5 గ్రా., పుదీనా - 10 గ్రా., జీలకర్ర - 5 గ్రా., నూనె - 200 గ్రా.
 
తయారీ విధానం : శనగపప్పును నానబెట్టి, మరీ మెత్తగా కాకుండా రుబ్బి పిండిలో కలపాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారం, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి ముద్దగా కలిపి ఉంచుకోవాలి. బాండిలో నూనె కాగిన తరువాత పిండిని కొంచెం తీసుకొని వడల్లాగా ఒత్తి ఎర్రగా వేయించాలి.
 
పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో ప్రొటీన్లు 4.23 గ్రా., కొవ్వు 54.41 గ్రా., పీచుపదార్థం 1.4 గ్రా., పిండి పదార్థం 22.37 గ్రా., శక్తి 597.92 కి.కెలోరీలు, కాల్షియం 96.95 మి.గ్రా., ఇనుము 0.79 మి.గ్రా.

Updated Date - 2019-11-04T16:00:27+05:30 IST