Abn logo

క్యారెట్‌, కొత్తిమీర, సోంపు సూప్‌

కావ

లసినవి: నాలుగు వందల గ్రాముల క్యారెట్‌ ముక్కలు, అరకప్పు తరిగిన కొత్తిమీర, రెండు టీస్పూన్ల చొప్పున సోంపు, నూనె, కొన్ని మిరియాలు, ఒకటి తరిగిన ఉల్లిపాయ, ఆరు కప్పుల నీళ్లు, ఒక టీస్పూన్‌ మీగడ, తగినంత ఉప్పు.
తయారీ విధానం:
ఒక గిన్నెలో నూనె పోసి మిరియాలు, సోంపు, ఉల్లిముక్కలు వేసి అవి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి నీళ్లు పోయాలి. క్యారెట్‌లు మెత్తగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మీగడ వేసి బాగా కలిపి వేడి వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.

లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు!ఆక్రమణలుయాసంగికి నీరందేనా?కొను‘గోడు’పంట పరిహారం ఇంకెప్పుడు?సమాజంలో ప్రశ్నించే గొంతుకలు కావాలి పల్లెల్లో ప్రశాంత వాతావరణంకాంగ్రెస్‌లో చేరికలు సత్యదేవుడి సన్నిధిలో భక్తుల పూజలు మధ్యాహ్న భోజన బిల్లులు అందేనా?
Advertisement