పెసరపప్పు హల్వా

ABN , First Publish Date - 2015-09-02T23:12:15+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - మూడు కప్పులు, నెయ్యి - ఒక కప్పు, పంచదార - నాలుగు కప్పులు,

పెసరపప్పు హల్వా

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - మూడు కప్పులు, నెయ్యి - ఒక కప్పు, పంచదార - నాలుగు కప్పులు, పచ్చి కోవా - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, జీడిపప్పు - 30గ్రా, మిఠాయి రంగు - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా నేతిలో జీడిపప్పును వేగించి పక్కకు తీసుకోవాలి. రెండు గంటల ముందు నానబెట్టిన పెసరపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. దాన్ని నేతిలో పచ్చి వాసన పోయేంత వరకు వేగించాలి. ఆ మిశ్రమంలో పంచదార, పచ్చికోవా, యాలకుల పొడి వేసి దగ్గరపడేంత వరకు చిన్న మంట మీద పదినిమిషాలు ఉంచాలి. చివర్లో వేగించిన జీడిపప్పు, మిఠాయి రంగు వేసి దించేయాలి. 

Updated Date - 2015-09-02T23:12:15+05:30 IST