బాదం-మష్రూమ్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-11-17T14:44:42+05:30 IST

కావలసిన పదార్థాలు : మష్రూమ్స్‌(ఉడికించిన చిన్న ముక్కలు)-అర కప్పు, బాదంపప్పు-20, పాలు-అర కప్పు, నీళ్లు-రెండు కప్పులు, మిరియాల పొడి-పావు టీస్పూన్‌, క్యారెట్‌ తురుము-రెండు టీ స్పూన్లు

బాదం-మష్రూమ్‌ సూప్‌

కావలసిన పదార్థాలు : మష్రూమ్స్‌(ఉడికించిన చిన్న ముక్కలు)-అర కప్పు, బాదంపప్పు-20, పాలు-అర కప్పు, నీళ్లు-రెండు కప్పులు, మిరియాల పొడి-పావు టీస్పూన్‌, క్యారెట్‌ తురుము-రెండు టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌(మొక్కజొన్న పిండి)-రెండు టీ స్పూన్లు, పాల క్రీమ్‌-రెండు టీస్పూన్లు, వెన్న-ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు-కొంచెం, చిల్లీ సాస్‌-కొద్దిగా, ఉప్పు-రుచికి తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా ఒక గిన్నెలో వెన్న వేసి వేడి చేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మష్రూమ్‌ ముక్కలు వేసి కొద్దిసేపు వేగాక దాంట్లో నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక అందులో బాదం ముక్కలు వేసి ఉడికించి, చివరలో పాలు పోయాలి. తరువాత విడిగా కొన్ని పాలలో కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు వేసి కలిపి పోయాలి. కాస్త చిక్కబడిన తరువాత దించి గిన్నెలో పోసి క్యారెట్‌ తురుము, మిరియాల పొడి, పాల క్రీమ్‌ వేసి వేగించిన బ్రెడ్‌ ముక్కల్ని అమర్చి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-11-17T14:44:42+05:30 IST