Abn logo

నిమ్మ సద్ది

కావలసినవి
 
బియ్యం - రెండు కప్పులు, నిమ్మకాయలు - 2, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - పావు టీస్పూన్‌, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - రెండు టీస్పూన్లు, పల్లీలు - పిడికెడు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - 3 టీ స్పూన్లు.
 
తయారీవిధానం
 
అన్నం పొడిపొడిగా వండి చల్లార్చుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేడి చేసి పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగించాలి. ఇందులో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. స్టవ్‌పై నుంచి దింపుకొని నిమ్మరసం పిండాలి. ఈ పోపుని అన్నంలో వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. పది నిమిషాల తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

జీడిపప్పు పులావ్‌దద్దోజనంస్వీట్‌కార్న్‌ పలావ్‌ క్యారెట్ రైస్పనసకాయ బిర్యానివాంగీబాత్‌సాబూదానా కిచిడీబిసిబేళ బాత్‌కొర్రల వెజిటబుల్‌ బిర్యానికొబ్బరి సద్ది
Advertisement
d_article_rhs_ad_1
Advertisement