ఉలవల రసం

ABN , First Publish Date - 2016-02-05T15:37:53+05:30 IST

కావలసిన పదార్థాలు: టొమాటోలు - రెండు, ఉలవల పొడి - రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు, మిరియాలు, జీలకర్ర- ఒక్కోటి పావు టీస్పూన్‌ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు - రెండు,

ఉలవల రసం

కావలసిన పదార్థాలు: టొమాటోలు - రెండు, ఉలవల పొడి - రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు, మిరియాలు, జీలకర్ర- ఒక్కోటి పావు టీస్పూన్‌ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - రుచికి సరిపడా, రసం పొడి - మూడు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, నిమ్మరసం - మూడు టీస్పూన్లు.
తయారీ విధానం: ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి టొమాటోలు, ఉలవల పొడి వేసి చేతితో మెత్తగా నలపాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్రలను మెత్తగా పొడి చేసి ఇందులో కలిపి సన్నటి సెగ మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. వేరే గిన్నెలో నూనె వేసి వేడిచేసి ఆవాలు, కరివేపాకు, మినపప్పు, శెనగపప్పు, ఇంగువ వేసి తాలింపు పెట్టి రసంలో పోయాలి.

Updated Date - 2016-02-05T15:37:53+05:30 IST