అటుకుల లడ్డు

ABN , First Publish Date - 2015-08-30T22:48:16+05:30 IST

కావలసిన పదార్థాలు: అటుకులు - 2 కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు - అర కప్పు, పుట్నాలు - అర కప్పు, మెత్తని పొడి బెల్లం - 1 కప్పు, (వేడి) పాలు - తగినన్ని.

అటుకుల లడ్డు

కావలసిన పదార్థాలు: అటుకులు - 2 కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు - అర కప్పు, పుట్నాలు - అర కప్పు, మెత్తని పొడి బెల్లం - 1 కప్పు, (వేడి) పాలు - తగినన్ని.
తయారుచేసే విధానం: అటుకుల్ని, ఎండు కొబ్బరిని, పుట్నాలను విడివిడిగా గ్రైండర్‌లో మెత్తగా పొడి చేసి పక్కనుంచాలి. ఈ పొడులన్నీ ఒక ప్లేటులో బెల్లం పొడితో పాటు బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా వేడిపాలను కలుపుతూ, మిశ్రమాన్ని గుప్పెటినిండా తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినే ఈ లడ్డూలు ఫ్రిజ్‌లో వారం పాటు నిలవ ఉంటాయి.

Updated Date - 2015-08-30T22:48:16+05:30 IST