అటుకుల హల్వా

ABN , First Publish Date - 2015-08-30T22:37:43+05:30 IST

కావలసిన పదార్థాలు: అటుకులు - నాలుగు కప్పులు, పంచదార - ఒక కప్పు, నెయ్యి - ఒక కప్పు, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - అర టీస్పూను,

అటుకుల హల్వా

కావలసిన పదార్థాలు: అటుకులు - నాలుగు కప్పులు, పంచదార - ఒక కప్పు, నెయ్యి - ఒక కప్పు, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - అర టీస్పూను, కుంకుమ పువ్వు - పావు టీస్పూను, డ్రైఫ్రూట్స్‌ - అర కప్పు, మిఠాయి రంగు - అర టీస్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె పోసి అటుకులను దోరగా వేగించి పక్కకు తీసుకోవాలి. మరో పాత్రలో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగాక వేగించి పెట్టుకున్న అటుకులు, పంచదార, నెయ్యి వేసి హల్వా దగ్గరపడేంత వరకు చిన్న మంటమీద ఉంచాలి. చివరగా యాలకుల పొడి, వేగించిన డ్రైఫ్రూట్స్‌, మిఠాయి రంగు వేసి దించేయాలి.

Updated Date - 2015-08-30T22:37:43+05:30 IST