చుమ్‌ చుమ్‌ బాల్స్‌ స్వీట్‌

ABN , First Publish Date - 2015-09-01T22:33:10+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, పనీర్‌ - 1 కప్పు, పంచదార - 2 కప్పులు,

చుమ్‌ చుమ్‌ బాల్స్‌ స్వీట్‌

కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, పనీర్‌ - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 200 గ్రా., కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో మైదా, పనీర్‌ వేసి బాగా కలిపి ముద్దలా చేసి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత నిమ్మకాయంత ఉండలు దొండకాయ షేపులో చేసి పక్కనుంచాలి. పంచదార లేత పాకం వచ్చాక పనీర్‌ బాల్స్‌ వేసి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కుంకుమపువ్వు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలపాలి. 

Updated Date - 2015-09-01T22:33:10+05:30 IST