కోవా క్యారెట్‌ డిలైట్‌

ABN , First Publish Date - 2015-09-02T20:24:39+05:30 IST

కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - 3 కప్పులు,

కోవా క్యారెట్‌ డిలైట్‌

కావలసిన పదార్థాలు : సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - 3 కప్పులు, క్యారెట్‌ తురుము - అరకప్పు, కోవా - 100 గ్రా., పంచదార - 2 కప్పులు, పాలు - 100 గ్రా., నెయ్యి - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, జీడిపప్పులు - 10, చెర్రీస్‌ - 10, యాలకులపొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - చిటికెడు.
తయారుచేసే విధానం : క్యారెట్‌ తురుముకు, ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి. ఉడికిన క్యారెట్‌ ముక్కల్ని మాత్రమే గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, జీడిపప్పును వేగించి తీసేయాలి. తర్వాత ఉడికిన తురుముని, రుబ్బుకున్న ముక్కల మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత పంచదార కలిపి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఈ లోగా కోవా, పచ్చికొబ్బరిని గ్రైండ్‌ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించాలి. నెయ్యి పైకి తేలినప్పుడు దించేసి యాలకులపొడి, జీడిపప్పు, కుంకుమపువ్వులతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-09-02T20:24:39+05:30 IST