ములక్కాడ రొయ్య పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:24:56+05:30 IST

కావలసిన పదార్థాలు: రొయ్యలు - అరకేజీ, టమోటా తరుగు - అరకప్పు, ఉల్లిపాయ తరుగు - 1కప్పు

ములక్కాడ రొయ్య పులుసు

కావలసిన పదార్థాలు: రొయ్యలు - అరకేజీ, టమోటా తరుగు - అరకప్పు, ఉల్లిపాయ తరుగు - 1కప్పు, ములక్కాడ (2 అంగుళాల) ముక్కలు - 10, చింతపండు గుజ్జు - అరకప్పు, కారం - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను,ఽ దనియాలపొడి - 1 టీ స్పూను, గరం మసాల - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు వేగాక, టమోటాలు వేసి మెత్తబడనివ్వాలి. దనియాలపొడి, కారం, పసుపు, ములక్కాడ ముక్కలు, రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ఉప్పు, చింతగుజ్జు (అవసరమనుకుంటే తగినన్ని నీళ్లు) వేసి 20 నిమిషాలు ఉడికించాలి. దించేముందు గరం మసాలాపొడి, కొత్తిమీర చల్లాలి. ములక్కాడ, రొయ్యలు కలగలిసిన కమ్మటి వాసనతో అన్నంలో కలుపుకుంటే భలే రుచిగా ఉండే పులుసు ఇది.


Updated Date - 2015-09-02T20:24:56+05:30 IST