అరటిపండు పెరుగు పచ్చడి

ABN , First Publish Date - 2015-12-01T14:38:32+05:30 IST

కావలసిన పదార్థాలు: అరటికాయలు - ఒకటి(పెద్దది), పెరుగు - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - రెండు, ఎండు మిరపకాయలు - రెండు, జీలకర్ర, ఆవాలు - ఒక టీ

అరటిపండు పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు: అరటికాయలు - ఒకటి(పెద్దది), పెరుగు - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - రెండు, ఎండు మిరపకాయలు - రెండు, జీలకర్ర, ఆవాలు - ఒక టీ స్పూను, కరివేపాకు - ఒక రెబ్బ, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా అరటికాయ ముక్కల్ని నీళ్లలో ఉడకపెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన ముక్కల్ని చిదుముకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత పెరుగు కూడా వేసి కలపాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. ఈ తాలింపుని అరటిముక్కల పెరుగులో వేసి కలపాలి.

Updated Date - 2015-12-01T14:38:32+05:30 IST