చికెన్‌ బైదా రోటి

ABN , First Publish Date - 2016-09-24T18:47:02+05:30 IST

కావలసిన పదార్థాలు: రుమాలి పిండి - 70 గ్రా,చికెన్‌ ఖీమా - 150 గ్రా,వెల్లుల్లి తరుగు - 5 గ్రా, అల్లం తరుగు - 5 గ్రా,

చికెన్‌ బైదా రోటి

కావలసిన పదార్థాలు: రుమాలి పిండి - 70 గ్రా,చికెన్‌ ఖీమా - 150 గ్రా,వెల్లుల్లి తరుగు - 5 గ్రా, అల్లం తరుగు - 5 గ్రా, ధనియాల పొడి - 5 గ్రా, డేగ్చి మిర్చి - 2 గ్రా, సాంబార్‌ మసాలా - 2 గ్రా, ఉప్పు - 10 గ్రా, గుడ్డు - 1, పెచ్‌దర్‌ మసాలా - 15 గ్రా.
 
తయారీ విధానం: చికెన్‌ ఖీమాకు మసాలాలన్నీ కలపాలి. రుమాలి పిండిని వత్తుకుని మధ్యలో చికెన్‌ మిశ్రమం ఉంచి చుట్టాలి. అంచుల్ని గుడ్డు సొన తడి చేసి మూసేయాలి. పాన్‌ను వేడి చేసుకుని రెండు వైపులా కాల్చి పుదీనా చట్నీతో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-09-24T18:47:02+05:30 IST