మైదా జిలేబీలు

ABN , First Publish Date - 2015-09-02T20:46:54+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా - 150 గ్రా., నీరు - వంద మిల్లీలీటర్లు, పెరుగు - 50 గ్రా.,

మైదా జిలేబీలు

కావలసిన పదార్థాలు: మైదా - 150 గ్రా., నీరు - వంద మిల్లీలీటర్లు, పెరుగు - 50 గ్రా., కుంకుమపువ్వు 4 కాడలు , నూనె - వేగించడానికి సరిపడా.
పంచదార పాకానికి: పంచదార - అరకేజి, నీరు - 200 మి.లీ., పాలు - 50 మి.లీ.
తయారుచేసే విధానం: ముందుగా పాత్రలో పంచదార, నీరు, పాలు కలిపి తీగపాకం వచ్చేదాకా మరిగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మైదా, పెరుగు, కుంకుమపువ్వు కాడలు, నీరు వేసి జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని జిలేబీల్లా నూనెలో వేగించుకొని పంచదార పాకంలో కొంత సేపు ఉంచి తీసేయాలి. ఇవి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T20:46:54+05:30 IST