పెసల పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:44:53+05:30 IST

పెసల పులుసు

పెసల పులుసు

కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు - 100గ్రా., నూనె - 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 2, ఇంగువ - చిటికెడు, ఆవాలు -1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప రుచికి తగినంత, చింతపండు గుజ్జు - 3 టేబుల్‌ స్పూన్లు.
మసాల కోసం: కొబ్బరి కోరు- 2 టేబుల్‌ స్పూన్లు, ధనియాలు - 1 టీ స్పూను, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, ఎండుమిర్చి - 3.
తయారుచేసే విధానం: మొలకెత్తిన విత్తనాలకు సరిపడ నీటిని చేర్చి సన్నని సెగపై మెత్తగా ఉడికించాలి. మసాల ముద్దతో పాటు ఉప, చింతపండు పులుసు కలిపి చిన్నమంటపై మరిగించి దించేయాలి. వేరే గిన్నెలో తిరగమోత పెట్టి పులుసులో కలపాలి. దీన్ని వేడిగా తింటే బాగుంటుంది.

Updated Date - 2015-09-02T20:44:53+05:30 IST