కాలీఫ్లవర్‌ 65

ABN , First Publish Date - 2015-10-01T16:03:25+05:30 IST

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: మీడియం సైజుది, మొక్కజొన్న పిండి: నాలుగు టేబుల్‌ స్పూన్లు, గట్టిపెరుగు:

కాలీఫ్లవర్‌ 65

కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్‌: మీడియం సైజుది, మొక్కజొన్న పిండి: నాలుగు టేబుల్‌ స్పూన్లు, గట్టిపెరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు, వంటసోడా: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, కారం: రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌ స్పూను, కరివేపాకు: కొద్దిగా.
తయారీ విధానం: కాలీఫ్లవర్‌ను విడదీసి మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు వుంచి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో మొక్కజొన్న పిండి, పెరుగు, వంటసోడా, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి అందులో కాలీఫ్లవర్‌ ముక్కలు కూడా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని తగినంత నూనె వేసి ముక్కలన్నీ అన్నీ ఒకే సారి లేదా కొన్నికొన్ని చొప్పున నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకోవాలి. ఇవి వేడి వేడిగా మధ్యాహ్నం స్నాక్స్‌ కింద తింటే రుచిగా వుంటాయి.

Updated Date - 2015-10-01T16:03:25+05:30 IST