పనీర్‌ జిలేబీ

ABN , First Publish Date - 2015-10-04T15:49:09+05:30 IST

కావలసిన పదార్ధాలు: పనీర్‌ తురుము- 1 కప్పు, మైదా- 4 టేబుల్‌ స్పూన్లు,

పనీర్‌ జిలేబీ

కావలసిన పదార్ధాలు: పనీర్‌ తురుము- 1 కప్పు, మైదా- 4 టేబుల్‌ స్పూన్లు, బొంబాయి రవ్వ- 2 టేబుల్‌ స్పూన్లు, పెరుగు- 1 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌- 1/2 టీ స్పూను, యాలకుల పొడి- 1 టీ స్పూను, పంచదార- 3 కప్పులు, నీళ్ళు- 3 కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పంచదార, యాలకుల పొడి వేసి తీగ పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనీర్‌లో మైదా, బొంబాయి రవ్వ, బేకింగ్‌ పౌడర్‌, పెరుగు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకుని రెండు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ తాడులా పేనుతూ, జిలేబి చుట్ట లాగా గుడ్రంగా చుట్టి, తక్కువ మంట మీద నూనెలో వేగించుకోవాలి. తరువాత పాకంలో వేసి, కొంచెం ఉబ్బుగా అయ్యాక బయటకు తీసివేయాలి.

Updated Date - 2015-10-04T15:49:09+05:30 IST