కాజూ ఆపిల్స్‌

ABN , First Publish Date - 2015-09-01T23:43:18+05:30 IST

కావలసిన పదార్థాలు: పంచదార- పావుకప్పు నీరు - పావుకప్పు,

కాజూ ఆపిల్స్‌

కావలసిన పదార్థాలు: పంచదార- పావుకప్పు నీరు - పావుకప్పు, జీడిపప్పు పొడి - అకప్పు, ఎర్రరంగు - చిటికెడు, సిల్వర్‌ ఫాయిల్‌ -సరిపడా, లవంగాలు - 10
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న ఒక పాత్రలో నీరు, పంచదారను కలిపి లేతపాకం వచ్చేవరకూ వేడిచేసి దించేయాలి. అందులో జీడిపప్పు పొడిని, ఎర్ర రంగుని వేసి బాగా కలిపి, ఆ ముద్దని పది సమాన భాగాలు చేయాలి. తర్వాత వాటిని ఆపిల్‌ ఆకారం వచ్చేలా చేసి సిల్వర్‌ ఫాయిల్‌ని అతికించి, పైన తొడిమలా లవంగాన్ని గుచ్చాలి. అంతే - కాజూ ఆపిల్స్‌ రెడీ!

Updated Date - 2015-09-01T23:43:18+05:30 IST