జొన్న పాయసం

ABN , First Publish Date - 2015-09-01T23:40:50+05:30 IST

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 1 కప్పు, పాలు (వేడి చేసి చల్లార్చినవి) - 1 కప్పు,

జొన్న పాయసం

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 1 కప్పు, పాలు (వేడి చేసి చల్లార్చినవి) - 1 కప్పు, నీరు - 1 కప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను, కొబ్బరిపొడి - ముప్పావు కప్పు, పంచదార - ఒక కప్పు, కోవా - అర కప్పు, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు - 4 కాడలు, నేతిలో వేగించిన కిస్‌మిస్‌ + జీడిపప్పు - 10 చొప్పున.
తయారుచేసే విధానం: పాన్‌లో నెయ్యి వేసి పిండిని దోరగా వేగించాలి. తర్వాత యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేగించి పాలు, నీరు పోసి అడుగంటకుండా తిప్పుతూ సన్నని మంటపైన 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పంచదార వేసి, అది కరిగాక కోవా వేయాలి. మరోరెండు నిమిషాలు ఉంచి జీడిపప్పు, కిస్‌మిస్‌, కుంకుమపువ్వు కాడల్ని పైన చల్లి దించేయాలి.

Updated Date - 2015-09-01T23:40:50+05:30 IST